భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

August 20, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం మరియు నిర్మల్ జిల్లా డిసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశానుసారం మాజీ శాసనసభ్యులు జీ. విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో భారత దేశ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారతదేశంలో వ్యవసాయ రంగంలో విప్లవత్మకమైన మార్పులు తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి మరియు టెక్నాలజీ రంగంలో ఎన్నో మార్పులు తెచ్చిన వ్యక్తి,భారతదేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల శ్రేయస్సు కొరకే పని చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఎండి.ఫరూక్ అహ్మద్, మాజీ జెడ్పిటిసి ఉత్తం భలే రావు, మాజీ ఎంపిటిసి పోశెట్టి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మౌలాకాన్, ధర్మేందర్,రాము,ఖాళీద్ ఖాన్ మాజీ సర్పంచ్ సాయినాథ్, ఆనంద్,మరియు తదితరులు ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper