PS Telugu News
Epaper

మానవత్వానికి నిలువుట అద్దం మన సూళ్ళూరుపేట సీఐ ఎం.మురళీకృష్ట

📅 18 Apr 2026 ⏱️ 6:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 18(సూళ్లూరు పేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు)

శాంతిభద్రతల పరిరక్షణలో కొరకు అధికారిగా పేరు తెచ్చుకున్నా కష్టాల్లో ఉన్న వారిని చూస్తే ఆయన కరుణా హృదయం ద్రవిస్తుంది ఆయనే సూళ్ళూరుపేట సీఐ ఎం.మురళీకృష్ణ గతంలో పరీక్షల సమయంలో విద్యార్థులు ఎండల తీవ్రతతో పడుతున్న ఇబ్బందులను గమనించి, వారికి చల్లని మజ్జిగను,పరీక్ష సామగ్రిని అందించి ఒక తండ్రిలా అండగా నిలిచిన అదే స్ఫూర్తిని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు
పట్టణంలోని గణపతి నగర్‌లో నివసిస్తున్న వికలాంగుడు వాయిలూరు మునెయ్య నడవలేక పడుతున్న వేదనను గుర్తించి ఆయనకు ట్రైసైకిల్‌ను అందజేసి ఒక అన్నలా అండగా నిలిచారు విధుల్లో ఎంత కచ్చితంగా ఉంటారో సామాజిక బాధ్యతలో అంతటి ఉదారతను చాటుకుంటున్న సీఐ గారిపై సూళ్ళూరుపేట ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక కవితాత్మక విశ్లేషణ
నాడు నేడు పరీక్షల వేళ చదువుల బిడ్డల చెంతకు చేరి,మండూ ఎండల్లో మజ్జిగమ్మవై సేదతీర్చిన సేవా నిరతి మీది పెన్నులు ప్యాడ్లు చేతికిచ్చి.. ‘ధైర్యంగా రాయండి అన్న భరోసా మీది గణపతి నగర్ మునెయ్య కళ్లలో.. ట్రైసైకిలై వెలిగిన ఆనందం మీది ఖాతీ దుస్తుల వెనుక ఒక కమ్మని కావ్యం ఉంది, కఠిన విధి నిర్వహణలోనూ నిండిన కరుణ ఉంది మురళీకృష్ణ గారూ మీ సేవ సమాజానికి ఒక గొప్ప పాఠం
సూళ్ళూరుపేట ప్రజల గుండెల్లో మీరు ఎప్పటికీ ఒక ఆప్తబంధువు

Scroll to Top