విద్యార్థుల భద్రత మా బాధ్యత సూళ్ళూరుపేట సీఐ ఎం మురళీకృష్
పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట సీఐ ఎం మురళికృష్ణ ప్రజల పట్ల విద్యార్థుల పట్ల ఎంత బాధ్యతతో ఉన్నారో ఈ యొక్క ప్రెస్ మీట్ నిదర్శనం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి తిరిగి జూన్ 12న బడులు ప్రారంభం అవుతాయి ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై సూళ్ళూరుపేట సీఐ ఎం.మురళీకృష్ణ పలు కీలక సూచనలు చేశారు. ఎండల తీవ్రత మరియు సెలవుల్లో పొంచి ఉన్న ప్రమాదాల దృష్ట్యా తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు
నీటి ప్రమాదాల పట్ల అప్రమత్తత ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. “సెలవుల్లో సరదా కోసం పిల్లలు కాలువలు, చెరువులు, బావుల వద్దకు ఈతకు వెళ్తుంటారు. లోతు తెలియక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి విద్యార్థులు నీటి వనరులకు దూరంగా ఉండాలి” అని సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున మధ్యాహ్నం పూట పిల్లలను బయటకు పంపవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు
వ్యసనాలపై ఉక్కుపాదం ముఖ్యంగా సూళ్ళూరుపేట, తడ మండలాల్లోని గ్రామాల్లో యువత, చిన్న పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంటుందని సీఐ హెచ్చరించారు. గంజాయి సేవించడం, రవాణా చేయడం లేదా మద్యం సేవించి రోడ్లపై అల్లరి చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. “విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావద్దనేది మా ఆకాంక్ష. అందుకే అసాంఘిక కార్యకలాపాలపై పోలీస్ నిఘా ఎప్పుడూ ఉంటుంది. మీ గ్రామంలో ఎవరైనా గంజాయి విక్రయించినా లేదా మత్తు పదార్థాలు సరఫరా చేసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం” అని ఆయన భరోసా ఇచ్చారు సమాజ నిర్మాణంలో సహకరించండి కేవలం శిక్షించడం మాత్రమే పోలీసుల ఉద్దేశ్యం కాదని, క్రమశిక్షణతో కూడిన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ సెలవులను ఉత్పాదక పనుల కోసం వినియోగించుకోవాలని, అసాంఘిక శక్తులకు దూరంగా ఉండి పోలీసులకు సహకరించాలని సీఐ ఎం. మురళీకృష్ణ పిలుపునిచ్చారు.తల్లిదండ్రుల కోసం చిన్న చిట్కా ఈ 50 రోజుల సెలవుల్లో పిల్లలను కేవలం ఇంట్లోనే ఉంచకుండా, వారికి ఉపయోగపడే కొత్త నైపుణ్యాలు (Skills) లేదా పుస్తక పఠనం వంటి వాటిపై దృష్టి సారించేలా ప్రోత్సహించండి
పోలీసులకు సహకరించండి సురక్షితమైన సమాజాన్ని నిర్మించండి