ఎరుగట్ల మండలం దోంచందా గ్రామంలో సీజ్ చేసిన 200 ట్రాక్టర్ల ట్రిప్పుల ఇసుక బహిరంగ వేలం వెయ్యడం జరిగింది
పయనించే సూర్యుడు 23 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ స్టాపర్ టీ కే గంగాధర్
బాల్కొండ నియోజకవర్గంలో ఏరుగట్ల మండలంలో తేదీ 23 ఏప్రిల్ 20 26 గురువారం రోజున ఇసుక వేలం వెయ్యడం జరిగింది అందరికీ తెలియజేయునది ఏమనగా తేదీ. 15-4-2026 రోజున దోమచంద గ్రామంలో అక్రమంగా నిలువచేసిన, సీజ్ చేసిన 200 ట్రాకర్ ట్రిప్పుల ఇసుకను ఈరోజు ఇసుక ఉన్న ప్రదేశంలో బహిరంగ వేళము వేయడం జరిగినది. ఇట్టి వేలంలో ఎరుగట్ల గ్రామమునకు చెందిన కల్లెడ సతీష్ తండ్రి సదానందం ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూపాయలు 2720/- అత్యధికంగా వేలం పాడి ఇసుకను పొందినారు. మొత్తము 200 ట్రాక్టర్ ట్రిప్పులకు గాను రూపాయలు 5,44,000/- ప్రభుత్వం వారికి చెల్లించినారు. ఇట్టి వేలం ద్వారా పొందిన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించుకొనుటకు ప్రభుత్వం వారి నుండి అనుమతి ఇవ్వబడును.
తాసిల్దార్, ఎయిర్ గట్ల మండలము.
