PS Telugu News
Epaper

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన – ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

📅 25 Apr 2026 ⏱️ 12:49 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 25 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం

ఐ పోలవరం గ్రామంలో పిఎసియస్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ పోలవరం గ్రామంలో పిఎసియస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధానంగా భావిస్తూ కనీస మద్దతు ధర (ఎంఎస్ పి) ప్రకారం ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయడానికి ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. మధ్యవర్తులపై ఆధారపడకుండా రైతులు తమ పంటను నేరుగా ప్రభుత్వానికి విక్రయించుకునే అవకాశాన్ని ఈ పీఏఎస్ కేంద్రాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా రైతులు తమ ధాన్యాన్ని పారదర్శకంగా, సరైన ధరకు అమ్ముకునే అవకాశం లభిస్తుందని, ఇది వారి ఆర్థిక స్థితి మెరుగుపడటానికి కీలకంగా మారుతుందని ఆయన తెలిపారు. రైతులు ఎటువంటి సందేహాలు లేకుండా స్వేచ్చగా ఈ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐ. పోలవరం సొసైటీ అధ్యక్షుడు కాకర్ల పూడి బుజ్జి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాగిరాజు సూరిబాబు రాజు పిన్నమరాజు శివరాజు తెలుగుదేశం గ్రామ కమిటీ కన్వీనర్ బొంతు ప్రసాద్ జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు దేవు రాంబాబు పలువురు మండల కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, రైతులు, గ్రామ ప్రజలు ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top