కమిటీలతో కాలయాపన చేయకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన
బిజెపి భువనగిరి ఇంచార్జి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి,అందే బాబయ్య,
బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఆర్టీసీ కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బిజెపి సీనియర్ నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్బంగా షాద్ నగర్ బస్ స్థాండ్ లోని ఆర్టీసీ కార్మికులను కలిసి వారికి మద్దతుగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు సంఘీభావం తెలపడం జరిగింది.వారు ఇరువురు మాట్లాడుతూకమిటీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నారు.
ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చి ఆర్టీసీ కార్మికులను ఆధుకోవాలని అన్నారు.ఆర్టీసీ కార్మికులు అధైర్య పడకుండా ఎవరుకూడ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆత్మ అత్యలు చేసుకోకూడదు ఉద్యమాల ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం అని అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు.ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడు బిజెపి పార్టీ అండగా ఉంటుందని అన్నారు.ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కక్కునూరి వెంకటేష్ గుప్త, కౌన్సిలర్ ప్యాట అశోక్, అప్పోజు విజయ్ బాస్కర్, శ్రీనివాస్ చారి, మల్ చలం మురళీ, మఠం ఋషికేష్, ఇస్నాతి గంగాధర్, అనిల్ కుమార్ గౌడ్, సుదీర్ పటేల్, గణేష్ నాయక్, శ్రావణ్, క్యాత్రమోని రమేష్, చెవుల బాస్కర్ మరియు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..