ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ సివిల్ సప్లై శాఖ వైఫల్యం
పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 ( సూళ్లూరు పేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలో ఒక విచిత్రమైన విషయం ప్రజలు గమనిస్తున్నారు ప్రతిరోజు ప్రతి పెట్రోల్ బంకులో సర్వసాధారణంగా గత మూడు రోజుల క్రితం దాకా డీజిల్ పెట్రోల్ స్టాకు లేదు అనే బోర్డు లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ఉన్న విషయం అందరికీ తెలిసినదే కానీ గత మూడు రోజులుగా పరిస్థితులు మారిపోయి పట్టణంలో సుమారు నాలుగు పెట్రోల్ బంకులు ఉంటే ఈ నాలుగు పెట్రోల్ బంకుల్లో ప్రతిరోజు నో స్టాక్ బోర్డు ఉండడమే కాక సప్లై లేదు అని ధైర్యంగా పెట్రోల్ బంక్ యజమానులు చెబుతున్నారు ఈ విషయం మీద అధికారులు జోక్యం చేసుకొని స్థానిక ఎమ్మార్వో వీఆర్వో స్థాయి అధికారులు పట్టణ పరిధిలోని పెట్రోల్ బంకుల వద్ద దగ్గర ఉండి ప్రజలకు పెట్రోల్ డీజిల్ అందిస్తున్నారు అంటే ప్రతిరోజు ఎంత స్టాక్ దిగుమతి అవుతుంది ఎంత సేల్స్ అవుతుందో అధికారులకు తెలియదా ఇంతకీ సూళ్లూరుపేటలో సివిల్ సప్లయర్స్ పౌరసరఫరాల శాఖ ఉందా? ఉంటే ఇప్పుడొచ్చి ఈ విధంగా పెట్రోల్ బంకుల దగ్గర ప్రభుత్వ అధికారులు పాగా వేసి అందరికీ ప్రజలందరికీ పెట్రోల్ డీజిల్ దగ్గర ఉండి పట్టిస్తున్నారు ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రతిరోజు వచ్చే స్టాకు ప్రతిరోజు అయిపోతూ ఉందా? మరి ఇన్ని రోజులు ఈ విధంగానే జరుగుతుందా? ఈ విషయం ప్రభుత్వా నికి తెలియదా? సాధారణంగా ప్రతి పెట్రోల్ బంకులో స్టాక్ వివరాలు బోర్డులో వ్రాయబడుతుంది ఎంత దిగుమతి ఎంత సేల్స్ అనే వివరాలు ప్రస్తుతం ఎవరికీ తెలియడం లేదు ప్రతిరోజు క్వాలిటీ చెక్ చేయబడుతుంది అది కూడా ప్రస్తుతం జరగడం లేదు ఈ గుంపులో గోవిందా పనుల్లో పెట్రోల్ బంక్ యాజమాన్యాలు కల్తీ సరుకులు కూడా అమ్ముకుంటు న్నారేమో అన్న అనుమానం ప్రజలలో ఉంది
