ఆశ వర్కర్లు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రం

May 18, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి భైంసా పట్టణంలోని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ నివాసంలో ఆశా వర్కర్లు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు మాట్లాడుతూ, ఆశా వర్కర్లు గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వారికి వేతనాల పెంపుతో పాటు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

🌐 Select Language:
📰 ePaper