జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్వర్గీయ నల్లా ఇంద్రాణి మెమోరియల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు, ఎంపీ హరీష్,

పయ సూర్యుడు సెప్టెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) సేవా దృక్పథంతో పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు: రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని (సెప్టెంబర్ 2) పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే అమలాపురం పట్టణంలో బృహత్తర ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.అమలాపురం పట్టణం వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో, నల్లా శ్రీధర్ సతీమణి స్వర్గీయ నల్లా ఇంద్రాణి మెమోరియల్ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ అమలాపురం టౌన్ నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానుల కలయికతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరం, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, ఎంపీ హరీష్ ముఖ్య అతిథిలు గా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అహరహం శ్రమిస్తున్న నాయకుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే ఇలాంటి సామాజిక, సేవా కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. ఎంపీ హరీష్ మాట్లాడుతూ స్వర్గీయ నల్లా ఇంద్రాణి జ్ఞాపకార్థం ఈ మెగా క్యాంప్ నిర్వహించి పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. నల్లా శ్రీధర్ సహకారం తో ఏర్పాటు చేసిన మెడ్ యునైటెడ్ వారి ఇన్సూరెన్స్ కార్డు లను లబ్దిదారులకు అందించారు.ఈ ఉచిత వైద్య శిబిరంలో పలువురు నిపుణులైన వైద్యులు పాల్గొని రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. స్థానిక ప్రజలు, జనసేన కార్యకర్తలు మరియు అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, ముపల్ మాజీ చైర్మన్ చిక్కాల గణేష్, బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు BJYM రాష్ట్ర అధికార ప్రతినిధి గనిసెట్టీ అరవింద్ చిక్కం సుధ పెచ్చేట్టి విజయలక్ష్మి, కల్వకొలను తాతాజీ సుదా చిన్నా, ఆర్ డి ఎస్ ప్రసాద్, ఏడిద శ్రీను, మహాదశ నాగేశ్వర రావు, ఆకుల సూర్య నారాయణ మూర్తి, కర్రి దత్తుడు, డి ఎస్ కుమార్, చిక్కం బాలాజీ జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ ప్రజాప్రతినిధులు, పట్టణ నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు,వైద్య బృందం పాల్గొన్నారు.