సేవా దృక్పథంతోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

September 1, 2026 | సినిమా వార్తలు

పయనించు సెప్టెంబర్ ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ మహారక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు​చిక్కం భీముడు, గండి స్వామి, చిక్కాల సతీష్ ల ఆధ్వర్యంలో ఎర్రవంతెన వద్ద మహారక్తదాన శిబిరం.. తరలివచ్చిన జనసైనికులుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని (సెప్టెంబర్ 2) పురస్కరించుకుని అమలాపురంలో జనసైనికులు, కూటమి నాయకులు అత్యంత ఆదర్శవంతమైన రీతిలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా ఒక రోజు ముందుగానే అమలాపురం ఎర్రవంతెన సమీపంలో ఉన్న వెంకటరమణ ఫంక్షన్ హాల్ నందు చిక్కం భీముడు, గండి స్వామి, చిక్కాల సతీష్ నేతృత్వంలో బృహత్తర “మహారక్తదాన శిబిరం” నిర్వహించారు.​ఈ మహారక్తదాన శిబిరాన్ని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్, శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేస్తున్న యువతను, జనసైనికులను వారు పరామర్శించి, అభినందించారు.​ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాధుర్, ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ… “జనసేనాని పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని ఆశిస్తారు. వారి ఆశయాలకు అనుగుణంగా, పుట్టినరోజు సందర్భంగా ఒక్క ప్రాణాన్ని కాపాడినా అది పవన్ కళ్యాణ్‌కు ఇచ్చే నిజమైన కానుక. రక్తం అందక ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే ఉన్నతాశయంతో యువత కలిసి ఈ ‘మహారక్తదాన శిబిరం’ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం” అని కొనియాడారు. “రక్తదానం – ప్రాణదానం” అనే సందేశాన్ని చాటుతూ పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేసిన రక్తదాతలందరికీ వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.​ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, DCMS చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, మున్సిపల్ మాజీ చైర్మన్ చిక్కాల గణేష్, జనసేన నాయకులు సుదా చిన్నాతెలుగుదేశం పార్టీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, స్థానిక కూటమి నాయకులు, రక్తదానం చేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువత తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper