మన అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ పోస్టర్‌ను ఆవిష్కరించిన బాలానగర్ ఏసిపి నరేష్ రెడ్డి

September 9, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి సిఐ స్వామిగౌడ్, స్టేషన్ ఇంచార్జి రవీంద్రారెడ్డి చేతుల మీదుగా కూకట్‌పల్లి యన్ ఆర్ సి గార్డెన్స్‌లో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, సీఐ స్వామి గౌడ్, స్టేషన్ ఇన్‌చార్జి రవీందర్ రెడ్డి, ఎస్‌ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు.మన అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కూకట్‌పల్లి లయన్స్ క్లబ్ మరియు జై గణేష్ భక్తి సమితి అధ్యక్షులు వెంకటరెడ్డి పోలీసు అధికారుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ, మట్టి వినాయకులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా నిర్వహించాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో నాగరాజు శ్రీనివాస్ రెడ్డి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper