అడవి పంది ఢీకొని- ద్విచక్ర వాహనం బోల్తా- దంపతులకు స్వల్ప గాయాలు

September 10, 2026 | తెలంగాణ

ఎమర్జెన్సీ రోగుల పాలిట సంజీవని లాగా మారిన అంబులెన్సులు – ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్

మార్గ మధ్యలోనే రోడ్డు ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్సలు-ఉదయ్ కుమార్(జిల్లాసూపర్వైజర్)

గోల్డెన్ అవర్ లోపు రోడ్డు ప్రమాద క్షతగాత్రుని ఆసుపత్రికి తరలింపు- ఇబ్బంది సేవలు మరువలేనివి

పయనించే సూర్యుడు సెప్టెంబర్11 నారాయణపేట జిల్లా:నర్వ మండలంలోని యాంకీ గ్రామానికి చెందిన రాయచూరు పల్లెప్ప కూరగాయల వ్యాపారి తను ఎప్పటిలాగే ఉదయం 4 గంటల ప్రాంతంలో తన ద్విచక్ర వాహనంపై భార్యని వెంటబెట్టుకొని, యాంకి గ్రామం నుంచి నారాయణపేటకు చేరుకొని, కూరగాయలు అన్నీ కూడా కొన్ని, ఉదయం 5 : 30 నిమిషాల ప్రాంతంలో ఉట్కూరు సంతకు తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు మార్గమధ్యమంలో తీపురస్పల్లి.గ్రామ సమీపన రోడ్డుపై వారి ద్విచక్ర వాహనంకి అడవి పంది పక్కనుంచి వచ్చి ఢీకొట్టింది, ఇద్దరు దంపతులు రోడ్డుపై పడిపోయారు స్థానికులు గమనించి, 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు, సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి కేవలం ఐదు నిమిషాల్లో చేరుకొని, రోడ్డు ప్రమాద క్షతగాత్రులను “పల్లెప్పకు తలకు మరియు ఎడమచేతి గాయాలు కావడం గమనించిన అంబులెన్స్ టెక్నీషియన్ రాజ్ కుమార్ ప్రథమ చికిత్స అనగా రక్తస్రావాన్ని ఆపడం, కృత్తిమ శ్వాసా అందించడం,వంటి పద్ధతులను ఉపయోగించి, ఈ ర్ సి పి డాక్టర్ శివ గారి సలహా సూచనలతో,దగ్గర్లో ఉన్న నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు పరీక్షించి దంపతులిద్దరూ క్షేమమని మరియు సకాలంలో స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి రాజకుమార్,పైలెట్: అనిల్ లను అభినందించారు.

🌐 Select Language:
📰 ePaper