ఈ నెల 17 న మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని…

September 10, 2026 | ఆంధ్రప్రదేశ్

లీ ఫార్మా సహకారంతో ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం


పయనించే సూర్యుడు సెప్టెంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) గిరిజనుల సంక్షేమం,అభివృద్దే ట్రస్ట్ లక్ష్యం.వైస్ చైర్మన్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి. ఈ నెల 17 వ తేదీ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని లీ ఫార్మా సహకారంతో.. ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు సంకల్పించింది. సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆరోగ్య సేవలను చేరువ చేయాలన్న సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ట్రస్ట్ వైస్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 17వ తేదీ ఉదయం మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొర్రపోలు గ్రామంలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎల్లప్పుడూ “అంత్యోదయ” స్ఫూర్తితో సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ గారి అంత్యోదయ సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని, అవసరంలో ఉన్న వారికి సేవ చేయడం ద్వారా సమాజానికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.కొర్రపోలు చెంచు తండాలో నివసిస్తున్న గిరిజనులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ వైద్య శిబిరాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రోటీన్ లోపం, ఎముకల బలహీనత, నరాల సంబంధిత సమస్యలు తదితర అనారోగ్య సమస్యలకు వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు, చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. అనుభవజ్ఞులైన పలువురు వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని గిరిజనులకు వైద్య సేవలు అందించనున్నారని తెలిపారు. అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలు అందేలా తగిన మార్గదర్శకత్వం కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు.ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన నాటి నుంచి ప్రజా సేవను ప్రధాన లక్ష్యంగా చేసుకుని వివిధ సామాజిక, వైద్య, సేవా కార్యక్రమాలను చేపడుతోందని డాక్టర్ రామచంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన, అట్టడుగు వర్గాలకు అండగా నిలుస్తూ “సేవే సమాజానికి నిజమైన సంపద” అనే భావనతో ట్రస్ట్ ముందుకు సాగుతోందన్నారు.ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని కేవలం వేడుకగా కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఉపయోగపడే దినోత్సవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.గిరిజన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని, తమ ఆరోగ్య సమస్యలకు నిపుణులైన వైద్యుల సలహాలు, చికిత్స పొందాలని ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ వైస్ ఛైర్మన్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కోరారు.

🌐 Select Language:
📰 ePaper