ప్రజా సమస్యల పరిష్కారానికి జనతా వారధి’ని సద్వినియోగం చేసుకోవాలి

September 12, 2026 | ఆంధ్రప్రదేశ్

–బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు

పయనించే సూర్యుడు సెప్టెంబరు 11: ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న ‘జనతా వారధి’ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రతి మండల అధ్యక్షుడు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ చీకరమెల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జనతా వారధి జిల్లా కో-కన్వీనర్ దాట్ల వెంకట సుబ్బరాజు అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరావు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులు, సమస్యలను స్వీకరించారు. ఆయా సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలకు పరిష్కారం చూపించడమే జనతా వారధి ఉద్దేశమని తెలిపారు. ప్రతి మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మండల అధ్యక్షులు జనతా వారధిని ఒక ప్రజా సేవా వేదికగా ఉపయోగించుకుని, సమస్యల పరిష్కారంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు ప్రజలకు–ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య వారధిగా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని శ్రీనివాసరావు అన్నారు కార్యక్రమంలో అమలాపురం బీజేపీ టౌన్ మండల అధ్యక్షుడు అయ్యల భాస్కరరావు, జిల్లా సర్ మీడియా కన్వీనర్ పెద్దిరెడ్డి శ్రీనివాస్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రావూరి వెంకట్, సీనియర్ నాయకుడు బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper