భైంసా మున్సిపల్ కార్యాలయం ముందు కాంట్రాక్టర్ల రిలే నిరాహార దీక్ష 4వ రోజు

September 12, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా మున్సిపల్ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నాలుగవ రోజుకు చేరుకుంది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దీక్షను కొనసాగిస్తున్నాం ఇంతవరకు మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి హామీ రాలేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బిల్లులు చెల్లించే వరకు, సమస్యలకు హామీ ఇచ్చేంత వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఒకవేళ స్పందన రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

🌐 Select Language:
📰 ePaper