నిర్మల్ పట్టణంలోని చింతకుంటవాడలో నూతన సిమెంట్ విద్యుత్ స్తంభాల ఏర్పాటు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో నిర్మల్ పట్టణంలోని స్థానిక చింతకుంటవాడలో 1956లో ఏర్పాటు చేసిన పాత విద్యుత్ స్తంభాలు ప్రజలకు ఇబ్బందికరంగా మారడంతో, వాటి స్థానంలో నూతన సిమెంట్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసే పనులు చేపట్టారు.మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అప్పాల కావ్య , వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో, స్థానిక 40వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి అడప విజయలక్ష్మి పోశెట్టి గారి సమన్వయంతో ఈ పనులు జరుగుతున్నాయి.
రాబోయే వినాయక శోభాయాత్రలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, పాత విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గండ్రత్ వెంకటరమణ, నాయకులు గండ్రత్ రమేష్, లక్కడి జగన్ మోహన్,విద్యుత్ శాఖ అధికారులు, వార్డు పెద్దలు, యువకులు పాల్గొన్నారు.