బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో గుంటూరు జిల్లా ఇంఛార్జికి సత్కారం
పయ నించే సూర్యుడు సెప్టెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) గుంటూరులో జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో గుంటూరు జిల్లా ఇంఛార్జి యాళ్ల దొరబాబుకు అభినందనలు దక్కాయి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ వారి సమక్షంలో, బిజెపి జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ జిల్లాలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు దొరబాబును కండువా వేసి సత్కరించి అభినందించారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు చిరుకూరి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా ఇంఛార్జిగా దొరబాబు చేస్తున్న కృషి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని శివప్రకాష్ జీ ఈ సందర్భంగా ప్రశంసించారు.