పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ వర్కర్స్ కార్మికులకు వెంటనే బకాయి జీతాలను చెల్లించాలి
పయనించే సూర్యుడు 20 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ రిపోర్టర్ టీకే గంగాధర్ ; తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్ రమేష్* డిమాండ్ చేశారు.పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ వర్కర్స్ కార్మికులకు వెంటనే బకాయి జీతాలను చెల్లించాలని, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు.బుధవారం నాడు గ్రామ పంచాయతీ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తు డిపివో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ:గ్రామాల్లో పారిశుద్యం పనులు చేసే కార్మికులకు వేతనాలు అంధక దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు అన్నారు.జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీ పని చేస్తున్న వర్కర్స్ కు రెండు మూడు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. గత రెండు రోజుల క్రితం కొన్ని గ్రామాలకు ఒక నెల జీతం మాత్రమే చెల్లించారు ఎక్కువ గ్రామాల్లో మూడు నెలల వేతనాలు పెండింగ్లోనే ఉన్నాయి గ్రామపంచాయతీలో డబ్బులు లేవు జీతాలు ఇవ్వలేము అని అధికారులు చెబుతున్నారు. వివిధ గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15 ఫైనాన్స్ నుంచి విడుదలలో చేసిన డబ్బులు ప్రతి గ్రామపంచాయతీల్లో ఉన్నాయి. గ్రామపంచాయతీ వర్కర్స్ జీతాల కోసం వాడుకోవద్దని రాష్ట్ర గ్రామ పంచాయతీ రాజ్ కమిషనర్ 15 ఫైనాన్స్ నుండి వర్కర్స్ కు జీతాలు చెల్లించవద్దని సర్కులర్ వచ్చిందని అందుకే ఇవ్వట్లేదని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీడీవోలు అంటున్నారు పై ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నామని మాకు తెలియజేస్తున్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండటానికి పచ్చదనం వెలిసిన దానికి ప్రజలకి మంచిని అందించడంలో ప్రజలకి ఆరోగ్యకరంగా ఉంచడంలో గ్రామపంచాయతీ కార్మికులు క్రియాశీలకంగా పని చేస్తున్నారు. అలాంటి వర్కర్స్ కు గ్రామ పంచాయతీల్లో డబ్బులు పెట్టుకొని కూడా జీతాలు ఇవ్వకపోవడం దారుణం.గ్రామపంచాయతీ వర్కర్లకు వస్తున్న అరా, కొర జీతం చాలా తక్కువగా ఉన్నది. అది కూడా ప్రతి నెల సక్రమంగా రాకపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం జరుగుతుంది. దీనితో అన్నామో రామ చంద్ర అనాల్సిన దుస్థితి నెలకొన్నది. కుటుంబ అవసరాలు తీరడం లేదు.కొన్ని గ్రామాలలో కొత్తగా వచ్చిన సర్పంచులు గ్రామపంచాయతీ వర్కర్స్ ను ఆదివారం కూడా పనిచేయాలని ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాలని లేకపోతే పని నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారు. భ్రయవంతులకు గురి చేస్తున్నారు.వర్కర్స్ గ్రామాలలో వివిధ మురికి పనులు చేస్తున్నారు వర్షాకాలం సమీపిస్తున్న వారికి రక్షణ సామాగ్రి మరియు సానిటరీ వస్తువులు సబ్బులు,బ్లౌజులు,డెటాల్ వంటి వస్తువులు ప్రతినెల తప్పనిసరిగా ఇవ్వాలి.పై సమస్యలు పరిష్కరించి కార్మికులకు నెల నెల క్రమం తప్పకుండా వేతనము ఇవ్వాలని తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం. గత్యంతరం లేని పరిస్థితిలో ఆందోళనకు పూనుకుంటాం అని ఆయన హేచ్చరించారు. కార్యక్రమంలో వి సత్తేవ్వ (రాష్ట్ర నాయకురాలు ), తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ టి యు సి ఐ
నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకులు అరవింద్ (జిల్లా నాయకులు ), ఒడ్డెటి ఆశన్న (ధర్పల్లి మండల అధ్యక్షులు ), కే రాజన్న (సిరికొండ మండల అధ్యక్షులు),టి జగన్ (మండల నాయకులు )
తదితరులు పాల్గొన్నారు.