అన్న సమారాధనలో పాల్గొన్న రాష్ట్ర బీసీ నాయకులు తెల్ల హరికృష్ణ
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో బజరంగ్ వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్న సమారాధన, రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.రక్తదాన శిబిరంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు.బజరంగ్ వినాయక భక్త బృందం సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు, జర్నలిస్టు తెల్ల హరికృష్ణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్న సమారాధనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా యువత రక్తదానంలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన బజరంగ్ వినాయక భక్త బృందం సభ్యులను ఆయన అభినందించారు.