పాపిరెడ్డి నగర్‌లో ఘనంగా వినాయక పూజలు.పలు మండపాలను సందర్శించిన చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి

September 19, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్, సెప్టెంబర్ 19 – తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గంలోని వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధి పాపిరెడ్డి నగర్‌లో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రోడ్డు నంబర్ 8బి, 11సి, 15బి బ్లాకుల్లో స్థానికులు ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను వెంకటేశ్వర నగర్ డివిజన్ పాపిరెడ్డి నగర్ పోటీ చేసిన అధ్యక్ష అభ్యర్థి చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి సందర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు దొడ్ల రామిరెడ్డి, విజయ్ గుప్తా, ఎడ్ల సంపత్ రెడ్డి తదితరులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఇతర నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మండపాల నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వినాయక ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు చర్ల రామకృష్ణా రెడ్డి, గడ్డం రాజేశ్వర్ రెడ్డి, మాయ రాజయ్య, సింగిరెడ్డి భూపాల్ రెడ్డి, చిట్టిరెడ్డి గోపాల్ రెడ్డి, వావిళ్ల బగ్గయ్య, డాకురి అక్కిరెడ్డి, మాయ బాలనర్సయ్య, వంగూరి శరత్ రెడ్డి, దొడ్ల సాయి రెడ్డి, ఎడ్ల శ్యామ్ సుందర్ రెడ్డి, మల్లేష్, ఎసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కర్ల తిరుపతి రెడ్డి, ప్రశాంత్, శ్రీనివాస్ రెడ్డి, మధు, వెంకట్ రెడ్డి, సాయి బాబా, మల్లారెడ్డి, దామోదర్ రెడ్డి, షెర్లీ, వినయ్, రాజిరెడ్డి, బాలరాజు, జగన్ మోహన్ రెడ్డి, వీరచారి, లక్ష్మీనారాయణ, కృష్ణా రెడ్డి, రాజేందర్, రవి, నర్సింహులు తదితర నాయకులు, కార్యకర్తలు, వినాయక మండపాల నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper