పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా. కె. రఘునాథ్ అధ్యక్షత వహించారు.ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు సేవాభావం, సామాజిక బాధ్యత, పరిశుభ్రతపై నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు కలిసి కళాశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసి పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డా. కె. రఘునాథ్ మాట్లాడుతూ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లలో క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు, బాధ్యత, సహనం, సమయపాలన, సహకార స్ఫూర్తి వంటి మంచి లక్షణాలు ఉండాలని సూచించారు. విద్యార్థులు సమాజ సేవలో చురుకుగా పాల్గొంటూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని అన్నారు.జిల్లా కన్వీనర్, డా. ఓంప్రకాశ్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రాముఖ్యత, దాని లక్ష్యాలు, సమాజ సేవలో ఎన్‌ఎస్‌ఎస్ పాత్రను వివరించారు. ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత, మానవతా విలువలు పెంపొందుతాయని తెలిపారు.డా. నహీదా తబస్సుమ్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎన్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల ద్వారా విద్యార్థులు సమాజ సమస్యలను అర్థం చేసుకుని ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పొందుతున్నారని తెలిపారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరే రాజు మాట్లాడుతూ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంతో పాటు సామాజిక స్పృహను పెంపొందిస్తుందని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఎన్‌ఎస్‌ఎస్ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌లో నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ క్యాంపులో పొందిన విపత్తుల సమయంలో స్పందన మరియు శిక్షణ అనుభవాలను వివరించారు.కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. యు. వి కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసంలో ఎన్‌ఎస్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు డా. జె. భీమారావు, డా. పవన్ కుమార్, డా. ఎం. శంకర్, డా. కల్పన, శ్రీమతి దివ్య తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.