పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటరీ మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించి మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పి.గన్నవరం నియోజకవర్గ ఎస్ఐఆర్ కన్వీనర్,జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కటికిరెడ్డి తమ్మయ్య నాయుడు,మాజీ జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి వేగి వెంకటేశ్వరరావు,మామిడికుదురు మండల ఉపాధ్యక్షులు ఏడిద బాబులు,ఏడిద రామ్మోహన్,ఆసుపత్రి సిబ్బంది,బిజెపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.