సినిమా వార్తలు

డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన ప్రమాదాల నివారణకు & ఇంధన పొదుపు పై శిక్షణ.

డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన ప్రమాదాల నివారణకు & ఇంధన పొదుపు పై శిక్షణ.

పయనించే సూర్యుడుD.25.9.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. కార్యక్రమం టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో డ్రైవర్లకు ప్రత్యేక డ్రైవర్ ట్రైనింగ్ రోడ్డు భద్రత మరియు ఇంధన పొదుపు పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీజియన్ మేనేజర్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్ మరియు ఇంధన పొదుపు పలు ముఖ్యమైన సూచనలు అందించారు.ఈ సందర్భంగా ఇంపాక్ట్ ఫౌండేషన్కు చెందిన సైకాలజిస్ట్ V.ప్రవీణ్ మరియు నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఎం. వెంకటరమణ మాట్లాడుతూ డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత, దృశ్య అవగాహన, మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యమని తెలిపారు. డ్రైవర్ చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని (Drunk & Drive), డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అలాగే డ్రైవర్లు విధులకు ముందు తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అలసటగా ఉన్నప్పుడు డ్రైవింగ్కు దూరంగా ఉండటం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఏకాగ్రత కోల్పోకుండా వాహనాన్ని నియంత్రణలో ఉంచుతూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరేలా డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఈ శిక్షణ లో భాగంగా డ్రైవర్లందరికి ఒక BS6 బస్సు మీద కుడా శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రీజియన్ మేనేజర్ నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఎం.వెంకటరమణ ,RTC డ్రైవర్లు, అవుట్సోర్సింగ్ డ్రైవర్లు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS