మక్తల్ తాలూకా పరిధిలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి CPM

May 21, 2026 | తెలంగాణ

మే 25న మక్తల్ నుండి కలెక్టరేట్ నారాయణపేట వరకు బైక్ యాత్రను జయప్రదం చేయండి

పయనించే సూర్యుడు మే 22మక్తల్ : సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మక్తల్ మండలంలోని మట్టి రోడ్లు ఉన్న బీటీ రోడ్లు వేయాలని, పాడైపోయిన తారు రోడ్లకు కొత్త రోడ్లు వేయాలని ఈనెల 25 నుంచి మక్తల్ పట్టణం నుండి నారాయణపేట కలెక్టరేట్ వరకు జరుగు బైకు యాత్రను విజయవంతం చేయాలని దాసరి దొడ్డి గ్రామంలో మక్తల్ భగత్ సింగ్ చౌక్ లో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మక్తల్ ఏరియా కార్యదర్శి పుంజనూరు ఆంజనేయులు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి ఆర్ గోవింద్ రాజ్, సీనియర్ నాయకులు భరత్ కుమార్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరసింహ, మాట్లాడుతూ మక్తల్ పట్టణం నుండి నారాయణపేట నాలుగు వరుసల రోడ్డు పనులు ప్రారంభించాలి. జిల్లా కేంద్రం కు ప్రధాన రహదారిగా ఉన్న ఈ రోడ్డు పూర్తిగా దంసమై గుంతలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలకు అంతులేని అసౌకర్యము, ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం నిరసిస్తూ రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్టు ) సిపిఎం మక్తల్ ఏరియా పార్టీ ఆధ్వర్యంలో తేదీ:-25-05-2026 సోమవారం మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం నుంచి నారాయణపేట జిల్లా కలెక్టరేట్ వరకు బైక్ యాత్ర తలపెట్టింది. ఈ బైక్ యాత్రలో యువజనులు ప్రజలు వాహనదారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి శివ, కే అశోక్, బాలు, ఆంజనేయులు, వెంకటేష్, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper