కెనరా బ్యాంక్ మేనేజర్ పవన్ చేతుల మీదుగా రూ.4 లక్షలు ఆర్థిక భరోసా

May 21, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు మే 21 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డి పాలెం గ్రామంలో వి. సాయి కుమార్ రోడ్డు ప్రమాదం ద్వారా మరణించడం జరిగింది.ఈయన గురించి బ్యాంక్ లో విచారించగా ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన(పిఎంఎస్ బివై), ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన రెండు యాక్టివ్ లో ఉన్నాయి అని తెలిసింది. దీనికిగాను సూళ్లూరుపేట ఆర్ధిక అక్షరాస్యతా కౌన్సిలర్స్ అయిన మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము. దీని ద్వారా రూ.4 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పిఎమ్ఎస్ బివై మరియు పీఎంజెజెబివై ద్వారా రూ.4 లక్షలు రూపాయలు చెక్కును ఈయన తల్లి వెంకటమ్మ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ పవన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన అందరూ చేసుకోవాలని భవిష్యత్తులో జరిగే అకాల సంఘటనలకు మీ కుటుంబాలకి చేయూత కలిగే విధంగా భరోసా కల్పిస్తుంది అని తెలియజేసినారు. ఈ స్కీమ్స్ మే, జూన్ నెలలో రెన్యూవల్ అవుతాయి కాబట్టి అందరు మీ అకౌంట్ లో డబ్బులు ఉంచుకొనేలా చూసుకోండి. పై కార్యక్రమంలో దొరవారిసత్రం కెనరా బ్యాంక్ మేనేజర్ పవన్ , అసిస్టెంట్ మేనేజర్ రవి తేజ దొరవారిసత్రం వెలుగు ఏపిఎం మునిరాజయ్య మరియు సూళ్లూరుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ముని చంద్ర, పరమానందం పాల్గొనడం జగిరింది.

🌐 Select Language:
📰 ePaper