తెలంగాణ

భైంసా పట్టణంలో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి

భైంసా పట్టణంలో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ నగర్ మరియు గుజరిగల్లి ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి స్వయంగా అందజేశారు.అనంతరం చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున ఇస్తుందని కానీ రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో మాత్రమే ఇస్తూ స్మార్ట్ రేషన్ కార్డు పైన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటో వేయకుండా రాజకీయ లబ్ధి పొందడం కొరకు రేవంత్ రెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు వేయించుకొని స్మార్ట్ రేషన్ కార్డు పేరిట వందల కోట్ల రూపాయలు నిర్వీర్యం చేస్తున్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దిలీప్ , కో – ఆప్షన్ మెంబర్ లింగురాం గారు, కౌన్సిలర్ ఆమీర్ ,లబ్ధిదారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS