పయనించే సూర్యుడ న్యూస్ అక్టోబర్ ఆరు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగవరం మండలం కోటిపల్లిలో 25 ఏళ్లు మోదీ సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్రి చిట్టిబాబు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అక్టోబర్ 6న చిట్టిబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని బిజెపి, కూటమి నాయకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, జనసేన నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్, టిడిపి నాయకులు పప్పుల రేవు శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ 25 ఏళ్లుగా నిరంతరం ప్రజా సేవలో వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న మోదీకి దేశ ప్రజలంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. చిట్టిబాబును శాలువాతో సత్కరించి ప్రజా క్షేత్రంలో ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. కోటిపల్లి సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య వైద్య శిబిరాన్ని వాసంశెట్టి సత్యం ప్రారంభించారు. దంత వైద్య శిబిరాన్ని పోలిశెట్టి చంద్రశేఖర్, హోమియో శిబిరాన్ని పప్పుల రేవు శ్రీను ప్రారంభించారు. జన్మదిన వేడుకలను ప్రజా సేవతో అనుసంధానిస్తూ వైద్య ఆరోగ్య శిబిరం, పోషణ, రక్తహీనత నివారణపై అవగాహన, మహిళల ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన, అవయవ దానంపై అవగాహన, మాదక ద్రవ్యాల రహిత యువ భారత్ నినాదంతో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మోదీ ఆశయం మేరకు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకర జీవనశైలితో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని చిట్టిబాబు పిలుపునిచ్చారు. వైద్యులను వాసంశెట్టి సత్యం సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు అవసరాల వెంకటరమణ మూర్తి, కొట్టువాడ హరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సలాది వీరబాబు, కోశాధికారి గ్రంధి నానాజీ, రామచంద్రపురం బిఎల్ఏ ఇంచార్జి సలాది శేఖర్, ముమ్మిడివరం బిఎల్ఏ ఇంచార్జి గొలకోటి వెంకటరెడ్డి, గంగవరం మండల బిజెపి కొప్పిశెట్టి చంద్రరావు, జిల్లా సేవా సంకల్ప్ కన్వీనర్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సతీష్, గంగవరం మండల జనసేన అధ్యక్షులు విజయ్ కుమార్, గొడవర్తి రామకృష్ణ, జి రామచంద్రరావు, వై బుల్లెబ్బాయి, చీకట్ల రాము, ఓబిసి మండల అధ్యక్షులు కృష్ణ, దాసరి ముత్యాలు, సలాది రామకృష్ణ, రాయుడు రామకృష్ణ, పలివెల రాజు, మండల ఉపాధ్యక్షులు డి మాచర్రావు, రామచంద్రపురం పట్టణ అధ్యక్షులు దునే శ్రీనివాస్, సతీష్ నాయుడు, పుల్లెల రామమూర్తి, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు గాణాల కళ్యాణ్, ప్రధాన కార్యదర్శి తోలేటి సూర్య గంగాధర్, గంగావత్తుల వీరబాబు, బ్రహ్మాడ బేబి సత్తిబాబు, మహిళా మోర్చా నాయకురాలు కొరిపెల్ల వెంకట నాగ శ్రవంతి, తలాటం అమ్మాజీ, మహిళలు, యువత, కూటమి నాయకులు పాల్గొన్నారు.