*ఓబీసీ బహిరంగ సభ విజయవంతం కావడంపై హర్షం*
*18వ వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి బాయ్ చందులాల్ ఆధ్వర్యంలో సన్మానం*
( పయనించే సూర్యుడు అక్టోబర్ 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )షాద్‌నగర్ బీసీ జనసేన ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను ఘనంగా సన్మానించారు. జాతీయ బీసీ జనసేన అధ్యక్షుడు కత్తి చంద్రశేఖరప్ప ఆధ్వర్యంలో, షాద్‌నగర్ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందూలాల్ నేతృత్వంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.ఇటీవల ఓబీసీల హక్కులు, సామాజిక న్యాయం, బీసీల ఐక్యత కోసం నిర్వహించిన బహిరంగ సభ విజయవంతానికి సహకరించినందుకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు బీసీ జనసేన నాయకులు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జాతీయ బీసీ జనసేన అధ్యక్షుడు కత్తి చంద్రశేఖరప్ప మాట్లాడుతూ.. బీసీల ఐక్యతను చాటిచెప్పేలా సభ విజయవంతమైందని, భవిష్యత్తులోనూ బీసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ జనసేన అధ్యక్షురాలు స్రవంతి రాజ్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి చెక్కుల జలజ, రాష్ట్ర నాయకులు మేకల వెంకటేష్, జూపల్లి చంద్రశేఖర్, శంకరయ్య, సత్యం, కృష్ణ, చాకలి శీను, కిషన్ తదితరులు పాల్గొన్నారు.