పయనించే సూర్యుడు సూర్యుడు అక్టోబర్ 6 ముమ్మిడివరం (గ్రంథి నానాజీ) డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం రూరల్ మండలం చినకొత్తలంక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని బిజెపి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు కొప్పిశెట్టి లావణ్య ఆధ్వర్యంలో బిజెపి నాయకులు సందర్శించారు. జిల్లా ఉపాధ్యక్షులు, రూరల్ మండల ఇంచార్జి గణిశెట్టి వెంకటేశ్వరరావు, సర్పవరం అసెంబ్లీ కన్వీనర్ గొలకోటి వెంకటరెడ్డి కేంద్రంలోని పిల్లలకు అందుతున్న విద్య, పోషకాహారం, మౌలిక వసతులను పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్యం, విద్య, పోషణకు అంగన్వాడీ కేంద్రాలు కీలకమని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కేంద్రాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు. అంగన్వాడీ సిబ్బంది సేవలను అభినందిస్తూ టీచర్లను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొత్తూరి మూర్తిరాజు, కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు సత్యనారాయణరాజు, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు ముదునూరి సత్యనారాయణరాజు, భాస్కరవర్మ, కృష్ణంరాజు, చిన్నారుల తల్లులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
