సినిమా వార్తలు

రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన-శిక్షణ కార్యక్రమం.

రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన-శిక్షణ కార్యక్రమం.

పయనించే సూర్యుడుD.06.10.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, ఇంధన పొదుపు మరియు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన-శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ మరియు డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి నిజామాబాద్ ట్రాఫిక్ ACP మస్తాన్ అలీ ముఖ్య అతిధిగా హాజరై డ్రైవర్లకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్కు చెందిన డా. ప్రవీణ్ కుమార్ డ్రైవర్లకు ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, ఆరోగ్య పరిరక్షణ, డ్రైవింగ్ సమయంలో అప్రమత్తత వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ “డ్రైవర్ అప్రమత్తతే ప్రయాణికుల భద్రతకు ప్రధాన రక్షణ” అని పేర్కొన్నారు. డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగించకూడదని, మద్యం సివించి వాహనం నడపకూడదని (Drunk & Drive) సూచించారు. తగిన విశ్రాంతి తీసుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని తెలిపారు. అలాగే డ్రైవర్లకు ప్రాక్టికల్ శిక్షణ తరగతులు నిర్వహించి, ప్రమాదకర పరిస్థితులను ముందుగానే గుర్తించడం, బ్రేకింగ్పై నియంత్రణ, వాహనాన్ని సురక్షితంగా నడపడం, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను వివరించారు. రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తూ డ్రైవర్లు విధులు నిర్వహిస్తే ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో పాటు ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అధికారులు తెలిపారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS