తెలంగాణ

12వ వార్డుకు కేటాయించిన లక్ష రూపాయలు ఎక్కడ ఖర్చు చేశారు?

12వ వార్డుకు కేటాయించిన లక్ష రూపాయలు ఎక్కడ ఖర్చు చేశారు?

మోరిలో పేరుకుపోయిన పూడికపై బ్యాటరీ రాజు తీవ్ర ఆగ్రహం

పయనించే సూర్యుడు అక్టోబర్ 8 మక్తల్ మక్తల్: మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో మురికి కాలువల్లో పూడిక పేరుకు పోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోక పోవడంపై బీజేపీ మక్తల్ టౌన్ కార్యదర్శి బ్యాటరీ రాజు తీవ్రంగా మండిపడ్డారు.మున్సిపాలిటీకి కేటాయించిన రూ.16 లక్షల్లో ప్రతి వార్డుకు రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించినట్లయితే, 12వ వార్డుకు వచ్చిన రూ.లక్ష నిధులను ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వార్డులోని మోరిలో ఇంత పెద్దఎత్తున పూడిక పేరుకుపోయి కనిపిస్తున్నప్పటికీ, దాన్ని తొలగించేందుకు నిధులు వినియోగించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.“12వ వార్డుకు కేటాయించిన రూ.లక్షతో కనీసం ఈ మోరిలో పూడిక కూడా తీయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయి? పనులు చేయకుండానే నిధులు ఖర్చు చేసినట్లు చూపిస్తున్నారా?” అని బ్యాటరీ రాజు ప్రశ్నించారు.వార్డువారీగా కేటాయించిన నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించి, పనులను నాణ్యతతో పూర్తి చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, సంబంధిత వార్డు కౌన్సిలర్‌పై ఉందని ఆయన అన్నారు. ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు పనులు క్షేత్రస్థాయిలో సక్రమంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కోరారు.అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారా లేదా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని, 12వ వార్డుకు కేటాయించిన నిధుల వినియోగంపై పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని బ్యాటరీ రాజు బిజెపి కార్యదర్శి.డిమాండ్ చేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS