పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 08 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కూకట్ పల్లిలో నేడు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. చందన.ఎన్ ముఖ్య అతిథిగా హాజరై, వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఇలాంటి పండుగలు విద్యార్థులలో ఐక్యతను, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని అన్నారు. విద్యార్థినులు చదువుతో పాటు సంస్కృతిని కాపాడుకోవాలని ఆమె సూచించారు.ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ డా. పద్మ ఆధ్వర్యంలో మరియు ఇతర మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆడిపాడారు. బతుకమ్మ విశిష్టత, మహిళా సాధికారతపై ఆమె వివరించారు. ఈ కార్య క్రమములో కూకట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు.ఈ వేడుకల్లో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.