తెలంగాణ

ఆర్టీసీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంకూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలి

ఆర్టీసీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంకూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలి

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డికూకట్‌పల్లి ఆర్టీసీ డిపోలో రేపు ఉదయం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో డిపో అధ్యక్షులు డాక్టర్ పి. నాగిరెడ్డి, భరత్‌నగర్ కాలనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ల వెంకటేష్ యాదవ్‌తో కలిసి స్థానిక డిపో కమిటీ సభ్యులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లు, ప్రచార సరళిపై చర్చించారు.ఈ సందర్భంగా డాక్టర్ పి. నాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఓటరు ఎంతో ముఖ్యమని, అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన అనంతరం కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఓటరుకు వివరించాలని తెలిపారు. ఆర్టీసీ సంస్థను, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు, కార్మికులకు వివరించడంతో పాటు కూటమి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగుతూ ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత అధికారుల సహకారం తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఈ సమావేశంలో డిపో కమిటీ సభ్యులు అశోక్, శివ, ముదిరాజు ఉపేందర్ యాదవ్, రామ్‌రెడ్డి, లక్ష్మీ, సత్తెమ్మ, ఉమ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS