
ఐదు గ్రామాల్లో మౌలిక వసతులకు మహర్దశ – రహదారులు, వాటర్ ట్యాంకులతో గ్రామాల రూపురేఖల మార్పు
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో రూ.2.54 కోట్ల అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) శ్రీకారం చుట్టారు. ఆదివారం పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డబ్ల్యూబీఎం రోడ్లు, డ్రైన్ పనులను ప్రారంభించి, నూతన పనులకు శంకుస్థాపనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మెరుగైన రహదారులు, తాగునీటి, పారిశుద్ధ్య వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. పల్లంకుర్రులో రూ.80.50 లక్షలు, కందికుప్పలో రూ.34.50 లక్షలు, దొంతికుర్రు పరిధిలో రూ.89.35 లక్షలు, కాట్రేనికోన మార్కెట్‌లో అంబేద్కర్ విగ్రహం నుంచి సుబ్బరాయుడు ఆలయం వరకు రూ.50 లక్షలతో సీసీ రోడ్ కమ్ డ్రైన్ పనులు చేపట్టారు. కందికుప్ప, పల్లంలో వాటర్ ట్యాంకులు, పల్లంలో టీడీపీ జెండా దిమ్మను ప్రారంభించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ముమ్మిడివరం చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ మండల అధ్యక్షుడు చెల్లి సురేష్, నాగిడి నాగేశ్వరరావు, నడింపల్లి సుబ్బరాజు, దాట్ల పవన్, ఇసుక పట్ల వెంకటేశ్వర్లు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.