సినిమా వార్తలు

జయహో బీసీ.. బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం – మంత్రి వాసంశెట్టి సుభాష్

జయహో బీసీ.. బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం – మంత్రి వాసంశెట్టి సుభాష్

రామచంద్రపురంలో బీసీ ఆత్మీయ సమ్మేళనంలో – రూ.250 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి, 34% రిజర్వేషన్లకు కూటమి కట్టుబడి ఉందని స్పష్టీకరణ

పయనించే సూర్యుడు అక్టోబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి బీసీల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని బీసీల అభ్యున్నతి, రాజకీయ సాధికారత, సామాజిక అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశమనే అనుబంధం దశాబ్దాలుగా ఉందని, ఎన్టీఆర్ 20% రిజర్వేషన్లు తెస్తే చంద్రబాబు 34%కి పెంచారని, వైసీపీ హయాంలో 24%కి తగ్గించి ఇప్పుడు చట్టబద్ధతకు అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. రామచంద్రపురం నియోజకవర్గంలో రూ.250 కోట్లతో 65% పైగా అభివృద్ధి పనులు చేపట్టామని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇరిగేషన్, బ్రిడ్జిలకు రూ.3,000 కోట్లు కేటాయించి సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్‌చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, బీసీ నేత పెండ్ర రమేష్, దంగేటి గౌరీశంకర్, మేడిశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS