మహానాడు కార్యక్రమాలు విజయవంతం చేయండి – జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి
పయానించే సూర్యుడు మే 25 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు -:2026 కార్యక్రమాన్ని ఈనెల 27,28 వ తేదీలలో హైబ్రిడ్ పద్ధతిలో క్లస్టర్ల వారీగా నిర్వహించాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా నియోజకవర్గ శాసనసభ్యులు, ఇన్ ఛార్జ్, కో కన్వీనర్లు మరియు మండల పార్టీ అధ్యక్షులు పర్యవేక్షణలో క్లస్టర్ ఇన్ ఛార్జ్ ల ఆధ్వర్యంలో నిర్వహించే మహానాడు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి పిలుపునిచ్చారు.