తెలంగాణ

సకాలంలో లైసెన్స్ ఫీజులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించండి

సకాలంలో లైసెన్స్ ఫీజులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించండి

–– అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ వినతి

పయనించే సూర్యుడు,అక్టోబర్ 23,అశ్వాపురం: గ్రామపంచాయతీ పరిధిలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులందరూ తమ వ్యాపార లైసెన్స్ ఫీజులను సకాలంలో చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ విజ్ఞప్తి చేశారు.గ్రామపంచాయతీ పరిధిలోని వ్యాపారస్తులు నిబంధనల ప్రకారం తమ వ్యాపార లైసెన్సులను పొందడంతో పాటు, నిర్ణీత సమయంలో లైసెన్స్ ఫీజులను చెల్లించాలని కోరారు. వ్యాపారస్తులు చెల్లించే లైసెన్స్ ఫీజులు గ్రామపంచాయతీ ఆదాయ వనరుల్లో ఒకటిగా నిలుస్తాయని, ఈ ఆదాయాన్ని గ్రామంలో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించేందుకు దోహదపడుతుందని తెలిపారు.గ్రామ అభివృద్ధి అనేది ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధుల సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి వ్యాపారస్తుడు గ్రామపంచాయతీకి సహకరిస్తూ, బాధ్యతాయుతంగా లైసెన్స్ ఫీజులు చెల్లించాలని సర్పంచ్ సదర్ లాల్ కోరారు, గ్రామ అభివృద్ధిలో వ్యాపారస్తుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, అందరూ సహకరించి అశ్వాపురం గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS