తెలంగాణ

మాకు న్యాయం చేయండి.. లేదంటే ఆత్మహత్యే శరణ్యం..

మాకు న్యాయం చేయండి.. లేదంటే ఆత్మహత్యే శరణ్యం..

మా స్థలాన్ని తొలగించాలని చూస్తున్నారు…

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండలం అక్బనగర్ గ్రామానికి చెందిన కాజ రోహిత్, కనకమెడల శ్రీలక్ష్మి, కాజా ఝాన్సీలకు సంబంధించిన స్థలం (స్థిరస్తి) ని గ్రామ సర్పంచ్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఇందులో నుండి దారి ఉందని, మా స్థలాన్ని తొలగించాలని చూస్తున్నారని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు విలేకరులతో మాట్లాడుతూ.. మా స్థలానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయని, ఈ ధృవపత్రాలు చెల్లవు అంటూ గ్రామ సర్పంచ్, పంచాయతీ సిబ్బంది, కొంతమంది గ్రామస్తులను పోగుచేసి మాపై కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సోమవారం గ్రామపంచాయతీ సిబ్బంది మా స్థలాన్ని తొలగించడానికి గడ్డపారలు తీసుకువచ్చారని అన్నారు. మేము చెప్పిందే చట్టం, మేము చెప్పిందే న్యాయం అంటూ మమ్మల్ని తీవ్ర భయభ్రాంతులకు, మానసికక్షోభకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. మీరు లీగల్ గా ప్రోసిడింగ్ అవ్వమని చెప్పిన కూడా వినకుండా మాపై కక్ష్య కట్టారని పేర్కొన్నారు. ఈ విషయం పై ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశామన్నారు. మా స్థలం విషయంలో ఎలాంటి తప్పిదాలు లేవని, మా దగ్గర అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయని, మేము ఏదైనా ఉంటే కోర్టు ద్వారా వెళ్తామని, మాకు న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్య శరణ్యమని బాధితులు పేర్కొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS