
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన శ్రీధర్ గౌడ్ తండ్రి అంగాల భూమాగౌడ్ అనారోగ్యంతో ఈనెల 14వ తేదీన మరణించారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం శ్రీధర్ గౌడ్ వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు,జువ్వుల శ్రవణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.