రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గురువారం పండగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పండగ సాయన్న సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.