
పయనించే సూర్యుడు అక్టోబర్ 23: ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన ఎంపీటీసీ-2 స్థానానికి మోకా బాల ప్రసాద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తనకు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఓగూరు భాగ్యశ్రీ, టిడిపి సీనియర్ నాయకులు నాగిడి నాగేశ్వరరావు, కృతజ్ఞతలు తెలిపినారు నామినేషన్ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు చెల్లి సురేష్ నూకల దుర్గ, బద్రి రమ, గుద్దాటి విజయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోకా బాల ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, ఎంపీటీసీగా గెలిచిన అనంతరం కాట్రేనికోన మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.*