పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో తల్లిని కోల్పోయి కష్టాల్లో ఉన్న చిన్నారికి మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి గారు తన వంతు సహాయంగా రూ.11,000 ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.తల్లిని కోల్పోయిన బిడ్డకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆయన ఈ విరాళాన్ని అందజేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, నిరుపేదలకు సహాయం చేయడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ ఆర్థిక సాయంతో పాటు, ఆ చిన్నారి విద్యాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు .