పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో బాసర మండలం లబ్ది గ్రామానికి చెందిన ప్రకృతి శంకర్ హౌజేకర్ ఎంబీబీఎస్‌లో సీటు సాధించి సత్తా చాటారు.నీట్ పరీక్షలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 1831వ ర్యాంకు సాధించి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశానికి అర్హత సాధించారు.హైదరాబాద్‌లో పదో తరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచి, నీట్‌లోనూ ప్రతిభ కనబరిచి వైద్య విద్యలో అడుగుపెడుతున్న ప్రకృతికి హృదయపూర్వక అభినందనలు.ప్రకృతి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి, వైద్య రంగంలో మరింత పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అధ్యక్షులు సాయిలు దాదా మైసేకర్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పాటిల్, రమేష్ బాబు వాఘ్మారే, ప్రభాకర్ జోంధలే, తానూర్‌కు చెందిన భీమారావు పవార్, బెల్లూరుకు చెందిన గంగాధర్ కాంబ్లే, లబ్ది గ్రామ పెద్దలకు ప్రత్యేక అభినందనలు.లబ్ది గ్రామానికి గర్వకారణంగా నిలిచిన ప్రకృతికి శుభాకాంక్షలు అని తెలిపారు.