నిద్రలో ఉన్న సూళ్లూరుపేట ప్రొబుషన్ & ఎక్సైజ్ అధికారులు

May 26, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు మే 26 (సూళ్లూరుపేట నియోజక వర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మద్యం విక్రయాలపై సంచలన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం పారదర్శక పాలన, నియంత్రిత ధరలతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని చెబుతున్న వేళ, స్థానిక స్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల్లో ప్రతి బాటిల్‌పై ₹10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నా రంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అదనపు భారం వల్ల సామాన్యులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం కొందరు బహిరంగంగానే “మేమంతా సిండికేట్ అయ్యాం.. ఇంకో మూడు నెలలే ఉంది” అంటూ మాట్లాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయని ప్రజలు అంటున్నారు. ఇది కొందరి అక్రమ వసూళ్ల వ్యవహారమా..? లేక వ్యవస్థలో లోపాలున్నాయా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ వెంటనే దర్యాప్తు చేసి వాస్తవాలను.బయటపెట్టాలని డిమాండ్ పెరుగుతోంది. అదనపు వసూళ్లు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

🌐 Select Language:
📰 ePaper