పయనించే సూర్యుడుD,31,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్,బాల్కొండ నియోజకవర్గంలోవివిధ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఎల్ఓసీ (LOC) మంజూరు చేయించిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్లోని వారి నివాసంలో బాధితుల కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ మంజూరు పత్రాలను అందజేశారు.1. ఎం.డి. మహమ్మద్ – మెండోరా మండల కేంద్రం, మెండోరా మండలం – రూ.75,000/-2. గంట స్టాన్లీ – జానకం పేట్ గ్రామం, వేల్పూర్ మండలం – రూ.2,50,000/-అనారగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉన్న తమకు ఎల్ఓసీ మంజూరు చేయించి ఆర్థిక భరోసా కల్పించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కి బాధితుల కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
