రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రంలో మూడు నెలల లోపు ఆవులకు, దూడలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. సోమవారం గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ చేతుల మీదుగా ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు రుద్రూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం కొనసాగనుందన్నారు. ఈ శిబిరంలో 30 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసినట్లు పశు వైద్యాధికారి డా. సురేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సాయిరాజ్, పాషా, అటెండర్ గంగారాం తదితరులు పాల్గొన్నారు.