రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం రుద్రూర్ ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. పనులు జరుగుతున్న స్థలానికి చేరుకుని, పనుల ప్రగతి, నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. కూలీల హాజరు, మస్టర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ కొలతలకు సరిపోను పూడికలు తీయాలని అన్నారు. పని ప్రదేశంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కూలీలకు కూలీ డబ్బులు సకాలంలో అందేలా చూడాలని, పని ప్రదేశంలో తాగునీరు, నీడ వసతి కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మచ్కూరి రమేష్, ఏపీవో రాజేశ్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ అమ్మొళ్ల సాయిలు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.