నియోజవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులందరూ ఘన విజయం సాధిస్తారని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ధీమా వ్యక్తం చేశారు. గురువారం కాట్రేనికోన మండలంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. దొంతికుర్రులో టీడీపీ నాయకులు, ప్రముఖ హోమియో వైద్యులు కొప్పిశెట్టి వెంకటరమణ స్వగృహం వద్ద స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. పోలింగ్ సరళిని డాక్టర్ రమణ ఎమ్మెల్యేకు వివరించారు. పోలింగ్ శాతం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో పూర్తి నమ్మకం ఉందని, ఆ నమ్మకమే విజయానికి బాటలు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి, దొంతికుర్రు టీడీపీ అధ్యక్షులు కాగిత భగవాన్, మోర్త గాంధీ, కముజు మల్లేష్, కొత్తపల్లి నరసింహమూర్తి, తాడి శ్రీనివాస్, కిట్టు తదితరులు పాల్గొన్నారు.