సినిమా వార్తలు

ఎలక్ట్రిక్ వాహనాలతోనే పర్యావరణ రక్షణ

ఎలక్ట్రిక్ వాహనాలతోనే పర్యావరణ రక్షణ

ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి

తిమ్మాపూర్ లో ఈడెన్ &శుభమ్ ఈవీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం ప్రారంభోత్సవం

ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

( పయనించే సూర్యుడు నవంబర్ 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) కొత్తూరు:పర్యావరణ పరిరక్షణ కు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎంతో దోహదపడుతుందని, భవిష్యత్తు అంతా ఈవీలదేనని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.కొత్తూరు మండలం లోని తిమ్మాపూర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతన ఈడెన్&శుభమ్ ఈవీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పెరుగుతున్న ఇంధన ధరల భారం నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించడంతో పాటు, కాలుష్య రహిత సమాజ స్థాపనకు ఈవీ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.సరికొత్త సాంకేతికతతో,తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే మోడళ్లను స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.ఈ సందర్బంగా షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి.ఈ కార్యక్రమంలో షోరూం యాజమాన్యం,బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS