పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గం లో ఏర్గట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన నేత ప్రియతమ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా కేకు కట్ చేసి టపాకాయలు కాల్చి అనుకూల నినాదాలు చేసి పెద్ద మొత్తములో ప్రజలకు అన్నదానం చేసి కేజీబీవి స్కూల్ విద్యార్థులకు పండ్ల పంపిణీ చెయ్యడం జరిగింది తర్వాత రెండు నూతన ఇందిరమ్మ ఇంటిలలో టపాకాయలు కాల్చి కొవ్వొత్తులు వెలిగించి దీపావళి సంబరాలు చేసుకొని ఇంటి వారికి నూతన వస్త్రాలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందచెయ్యడం జరిగింది. ఇట్టి కార్యక్రమములో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తో పాటు సర్పంచులు, ఉపసర్పంచులు, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు అత్యధికముగా పాల్గొన్నారు
